మీ ఆధార్ డేటా సేఫ్‌గా ఉందా? బయోమెట్రిక్స్ లాక్ చేయడం ఎలాగో తెలుసా?
ఈ డిజిటల్ యుగంలో ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికీ అత్యవసరం. ఇది ఒక గుర్తింపు కార్డు, ఇందులో వ్యక్తి బయోమెట్రిక్ వివరాలు ఉంటాయి. అయితే, మనం ఆధార్ వివరాలను ఎక్కడపడితే అక్కడ ఇవ్వాల్సి రావచ్చు. కాబట్టి మీ బయోమెట్రిక్ వివరాలను లాక్ చేసుకోవడం ద్వారా వాటిని దుర్వినియోగం కాకుండా, స్కామ్‌ల నుండి రక్షించుకోవచ్చు. ఆధార్ బయోమెట్రిక్‌ను ఎలా లాక్ లేదా అన్‌లాక్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Aadhaar Update: మీ ఆధార్ కార్డు వివరాలు ఇతరుల చేతుల్లోకి వెళ్లకుండా జాగ్రత్త వహించాలి. ఆధార్ కార్డులో 12 అంకెల నంబర్‌తో పాటు మన బయోమెట్రిక్ వివరాలు, పుట్టిన తేదీ, చిరునామా , ఫోన్ నంబర్ వంటి సమాచారం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనం ఆధార్ నంబర్‌తో పాటు ఫోటో కాపీలను కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ ఆధార్ నంబర్ ఎవరికైనా తెలిసినా, మీ బయోమెట్రిక్ వివరాలను లాక్ చేయడం ద్వారా పెద్ద సమస్యల నుండి తప్పించుకోవచ్చు. ఇది మీ కుటుంబ సభ్యులు కూడా స్కామ్‌లలో పడకుండా రక్షణ కల్పిస్తుంది.
ఆధార్ కార్డులో వ్యక్తిగత వివరాలు ఉండటం వల్ల వాటిని రక్షించడానికి UIDAI అద్భుతమైన ఫీచర్లను అందించింది. అదే ఆధార్ బయోమెట్రిక్ లాక్ సౌకర్యం. దీనిని మీరు కావాలనుకున్నప్పుడు అన్ లాక్ కూడా చేసుకోవచ్చు. ఈ ప్రక్రియను అధికారిక UIDAI వెబ్‌సైట్ లేదా ఆధార్ యాప్ ద్వారా నిర్వహించవచ్చు. చాలామంది ఆధార్ లాక్ చేసిన తర్వాత అన్లాక్ చేయడంలో ఇబ్బందులు పడుతుంటారు, కాబట్టి ఆధార్‌ను ఎలా అన్లాక్ చేయాలో కూడా ఇప్పుడు చూద్దాం.
ఆధార్ యాప్ ఉపయోగించి బయోమెట్రిక్ అన్‌లాక్ చేసే విధానం:
ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో ఆధార్ యాప్‌ను ఓపెన్ చేయండి. అక్కడ మీ పూర్తి వివరాలను సెక్యూరిటీ వెరిఫికేషన్ కోసం ఎంటర్ చేయండి. అందులో బయోమెట్రిక్ లాక్ ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ 'అన్ లాక్' ఆప్షన్‌ను సెలెక్ట్ చేయండి. స్క్రీన్‌పై సూచించిన ఇన్ స్ట్రక్షన్స్ పూర్తి చేస్తే, మీ ఆధార్ బయోమెట్రిక్ విజయవంతంగా అన్ లాక్ అవుతుంది.
Read Also: రేపు అక్టోబర్ 21న ఎస్‌బీఐ, పీఎన్‌బీ సహా ఇతర బ్యాంకులు పనిచేస్తాయా? లేదా?
Read Also: దీపావళికి ముందే రూ.2000 జమవుతాయా? PM కిసాన్ 24వ విడతపై బిగ్ అప్‌డేట్!
మై ఆధార్ పోర్టల్ ద్వారా బయోమెట్రిక్ అన్‌లాక్ చేయడం:
UIDAI వెబ్‌సైట్‌లోని 'మై ఆధార్' పోర్టల్‌ను ఓపెన్ చేసి, లాగిన్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తే, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. ఆ OTPని నమోదు చేసిన తర్వాత, 'లాకింగ్ లేదా అన్‌లాకింగ్ యువర్ బయోమెట్రిక్' అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి. అక్కడ ఇచ్చిన సూచనలను పాటించిస్తే, మీ ఆధార్ బయోమెట్రిక్ అన్ లాక్ అయిపోతుంది. మన దేశంలో స్కూల్, కాలేజీ అడ్మిషన్ల నుండి బ్యాంక్ అవసరాల వరకు ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికీ తప్పనిసరి. ఏ ప్రభుత్వ పథకానికి అర్హత పొందాలన్నా ఆధార్ ఉండాల్సిందే. ఆధార్ అనేది ఒక వ్యక్తి ముఖ్యమైన గుర్తింపు కార్డు, అందులో బయోమెట్రిక్ వివరాలు ఉంటాయి. కాబట్టి, ఆధార్ దుర్వినియోగం కాకుండా ఉండాలంటే మీ బయోమెట్రిక్ వివరాలను లాక్ చేసుకోవడం ఉత్తమం.