• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /రూ. 5 లక్షల ఉచిత వైద్యం.. ఆయుష్మాన్ భారత్ లిస్ట్‌లో మీ పేరుందో లేదో ఫోన్‌లోనే ఇలా చెక్ చేసుకోండి!

రూ. 5 లక్షల ఉచిత వైద్యం.. ఆయుష్మాన్ భారత్ లిస్ట్‌లో మీ పేరుందో లేదో ఫోన్‌లోనే ఇలా చెక్ చేసుకోండి!

మీకు కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న ఆయుష్మాన్‌ భారత్‌ కార్డు ఉందా? లేకపోతే వెంటనే దరఖాస్తు చేసుకోండి. రూ.5 లక్షల వరకు ఉచితంగా వైద్య చికిత్స పొందుతారు. దీనికి ముందుగా దరఖాస్తు చేసుకోవడానికి అర్హత వివరాలు తెలుసుకోండి. అప్లై చేసుకున్నవారు ఆన్‌లైన్‌లోనే మీ పేరు లిస్ట్‌లో ఉందా? చెక్‌ చేయండి..

Written ByRenuka Godugu
Published: Nov 05, 2026, 11:47 AM IST|Updated: Nov 05, 2026, 11:52 AM IST
joinshare
రూ. 5 లక్షల ఉచిత వైద్యం.. ఆయుష్మాన్ భారత్ లిస్ట్‌లో మీ పేరుందో లేదో ఫోన్‌లోనే ఇలా చెక్ చేసుకోండి!
Image Credit: Check Your Name Ayushman Card: File

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ఖరీదైన క్రీమ్స్ అవసరం లేదు.. రోజూ ఈ నీళ్లు తాగితే 5 రోజుల్లో మీ చర్మంలో చూసే మార్పులివే!

ఖరీదైన క్రీమ్స్ అవసరం లేదు.. రోజూ ఈ నీళ్లు తాగితే 5 రోజుల్లో మీ చర్మంలో చూసే మార్పులివే!

2

Kavitha: రేవంత్‌ రెడ్డి కుటుంబానికి కామధేనువులా హైదరాబాద్‌.. మొత్తం దోపిడే: కవిత

3

హైదరాబాద్ వాసులకు దీపావళి ధమాకా! భారీగా తగ్గనున్న మెట్రో-RTC కామన్ పాస్ రేట్లు.. కొత్త ధరలు ఇవే!

4

హైదరాబాద్ నడిబొడ్డున మరో ఐమాక్స్ స్క్రీన్.. వెంకీ, మహేష్‌ల AMB విక్టరీ..

5

దృష్టిలోపం ఉన్న భక్తులకు గుడ్‌న్యూస్.. అయోధ్య రాముడి దర్శనం మరింత సులభం

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Check Your Name Ayushman Card: కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న ఎన్నో పథకాల్లో ఆయుష్మాన్‌ భారత్‌  కార్డు పేదలకు వరం వంటిది. ఇందులో రూ.5 లక్షల వరకు ఉచితంగా వైద్య చికిత్స పొందవచ్చు. ప్రధానంగా ఆర్థికంగా వెనుకబడిన వారికోసం కేంద్రం ఈ అద్భుతమైన పథకాన్ని ప్రారంభించింది. ఈరోజుల్లో ఆసుపత్రి, వైద్య పరీక్షలు అంటేనే ఖర్చు తడిసి మోపెడవుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకోని కేంద్ర ప్రభుత్వం ఈ అద్బుతమైన పథకాన్ని ప్రారంభించింది. దాని పేరే 'ఆయుష్మాన్‌ భారత్‌ ప్రధాన మంత్రి జన్‌ ఆరోగ్య యోజన' పథకం.  ఇందులో అర్హులైన వారికి ఏడాదికి రూ.5 లక్షల వరకు ఉచితంగా వైద్య చికిత్స కవరేజీ పొందుతారు. అయితే, ఈ బెనిఫిట్‌ పొందాలంటే ముందుగా ఆయుష్మాన్‌ కార్డు కలిగి ఉండాల్సిందే. అయితే, ఇప్పటికీ మీరు ఆయుష్మాన్‌ కార్డు దరఖాస్తు చేసుకోకపోతే మీ మొబైల్‌ ఫోన్‌లోనే సింపుల్‌గా అప్లై చేసుకోవచ్చు. ఆయుష్మాన్‌ భారత్‌ ప్రధాన మంత్రి జన్‌ ఆరోగ్య యోజన కార్డు ఆన్‌లైన్‌ మీ అర్హత చెక్‌ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆయుష్మాన్‌ కార్డుకు దరఖాస్తు చేసుకునే విధానం..
ముందుగా మీరు ఈ ఆయుష్మాన్‌ స్కీమ్‌కు అర్హత ఉందా? అధికారిక పోర్టల్‌లో చెక్‌ చేయండి.
పోర్టల్‌లో మీ మొబైల్ నెంబర్‌ నమోదు చేసి లాగిన్‌ అవ్వండి.
అక్కడ మీ రాష్ట్రం, జిల్లా సెలక్ట్‌ చేయండి.
ఆ తర్వాత సంబంధిత డాక్యుమెంట్‌ ఎంపిక చేయండి. అంటే ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు, ఫ్యామిలీ ఐడీ. సెర్చ్‌ చేసిన తర్వాత మీ కుటుంబ వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తుంది.

Read Also: ఆధార్ దుర్వినియోగం కాకుండా ఉండాలా? మాస్డ్క్‌ ఆధార్‌ను ఫోన్‌లోనే ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా!
Read Also: ఆధార్ వినియోగదారులకు మైండ్ బ్లాకింగ్ అప్‌డేట్.. గత 6 నెలల్లో ఎక్కడెక్కడ వాడారో చెక్ చేసే సింపుల్ ట్రిక్!
 

ఆన్‌లైన్‌లో ఆయుష్మాన్‌ కార్డు పొందే విధానం..
మీరు ఒక వేళ ఈ పథకానికి అర్హులు అయితే, ఈకేవైసీ పూర్తి చేయండి. లబ్దిదారుల పోర్టల్‌లో మీరు పేరుతో లాగిన్‌ అవ్వండి. 
మీ కుటుంబంలో ఎవరికైనా కార్డు లేకపోతే అక్కడ ఈకేవైసీ ఆప్షన్‌ ఎంపిక చేయండి.
ఆధార్‌ ఆధారిత ఓటీపీ లేదా ఫేస్‌ అథంటికేషన్‌తో వెరిఫై చేయండి.

మీ వివరాలు ఫిల్‌ చేసిన తర్వాత సబ్మిట్‌ చేయండి. ఈకేవైసీ పూర్తయిన వెంటనే మీ అప్లికేషన్‌ స్టేటస్‌ చెక్‌ చేసుకోవచ్చు.  మీ కార్డు ఆమోదం పొందిన వెంటనే ఆయుష్మాన్‌ కార్డును డౌన్‌లోడ్‌ కార్డు ఆప్షన్‌తో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మీ ఆయుష్మాన్‌ భారత్‌ కార్డు ఆన్‌లైన్‌లో లేదా కామన్‌ సర్వీస్‌ సెంటర్‌లో కూడా పొందవచ్చు. లేదా ఆయుష్మాన్‌ మిత్ర, అధికారిక వెబ్‌సైట్‌ https://beneficiary.nha.gov.in లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

Add Zee News as a Preferred Source
TAGS:
Govt Schemes
National News
Telugu News