సెకన్లలో దీపావళి రైలు టికెట్ పొందడం ఎలా? ఈ ఐఆర్‌సీటీసీ ట్రిక్ వాడారంటే 100 శాతం బెర్త్ సొంతం!
దీపావళి పండక్కి ఊరేళ్లలనుకుంటున్నారు? టిక్కెట్ రిజర్వేషన్ లేదా? అయితే, తత్కాల్ టిక్కెట్ బుక్ చేసుకోండి. ఐఆర్‌సీటీసీ ఈ నయా ఫీచర్‌తో మీరు సింపుల్‌గానే బుక్ చేసుకోవచ్చు. ఇందులో ఏసీ, నాన్ ఏసీ రైలు టిక్కెట్లు కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
IRCTC Tatkal Ticket Booking Trick for Diwali 2026: సాధారణంగా భారతీయ రైల్వేలో సీట్ రిజర్వేషన్ పొందాలంటే 60 రోజులు ముందుగా ఉదయం 8 గంటలకే బుక్ చేసుకోవాలి. ప్రధానంగా పండుగ, ఎక్కువగా రద్దీ ఉండే స్టేషన్‌లలో అయితే కేవలం సెకన్‌లలో టిక్కెట్లు అమ్ముడైపోతాయి. ఇక తత్కాల్ గురించి చెప్పనక్కర్లేదు.. ఈ దీపావళికి సొంతూరుకు వెళ్లేవారికి భారీ శుభవార్త.. మీరు పండుగకి వెళ్లేవారికి ఒక రోజు ముందు వెళ్లాంటే చిన్న ట్రిక్‌తో మీ ట్రైన్ టిక్కెట్ బుక్ అయిపోతుంది. దీపావళి ఈనెల 8వ తేదీ రానుంది. మీరు 7వ తేదీ ప్రయాణం చేయాలనుకుంటే రేపే 6వ తేదీ ఒకరోజు ముందు ఉదయం 10 గంటలకు బుక్ చేయాల్సి ఉంటుంది. ఇది ఏసీ కోచ్‌లతోపాటే నాన్ ఏసీ క్లాసులకు కూడా వర్తిస్తుంది. వీటి టైమింగ్స్‌లో కాస్త మార్పు ఉన్నా మీరు సులభంగా తత్కాల్ టిక్కెట్ బుక్ చేసుకోవచ్చు.
ఏసీ, స్లీపర్ క్లాస్ తత్కాల్ నియమాలు..
భారతీయ రైల్వే ప్రకారం తత్కాల్ టిక్కెట్‌పై ప్రయాణం చేయాలంటే ఒక్క రోజు ముందుగా రైలు టిక్కెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఏసీ, 2టైర్, 3 టైర్‌కు కూడా వర్తిస్తుంది. అయితే, ప్రతిరోజూ ఉదయం 10 గంటకు ఏసీ తత్కాల్ టిక్కెట్స్ బుక్ చేసుకోవచ్చు. నాన్‌ఏసీ అయితే 11 గంటలకు ప్రారంభం అవుతుంది.
తత్కాల్ టిక్కెట్స్ బుక్ చేసే విధానం..
ఈ రైల్వే తత్కాల్ టిక్కెట్స్ ఆన్‌లైన్‌లో ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్‌లో బుక్ చేసుకోవచ్చు. లేదా ఆఫ్‌లైన్‌లో అయితే, రైల్వే రిజర్వేషన్ కౌంటర్‌కు వెళ్లి బుక్ చేసుకోవచ్చు. మొదట ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ లేదా ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ మొబైల్‌యాప్‌లో కూడా టిక్కెట్స్ బుక్ చేసుకోవచ్చు.
దీనికి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ తప్పనిసరి. మీ ట్రావెల్ వివరాలు కూడా నమోదు చేసి 'తత్కాల్' కోటా ఎంచుకోవాలి. అక్కడ మీ పేరు, ప్రయాణ వివరాలు ఎంటర్ చేయాలి. మీ టిక్కెట్ వివరాలు వెరిఫై అయిన వెంటనే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ టిక్కెట్ కన్ఫామ్ అయిందా? వెయిటింగ్ లిస్ట్‌లో ఉందా? వెరిఫై చేయండి.
Read ALso: విశాఖ వాసులకు గుడ్ న్యూస్.. చర్లపల్లికి స్పెషల్ ట్రైన్! కానీ ఆ రూట్లలో పలు రైళ్లు రద్దు!
Read ALso: చార్ట్ ప్రిపేర్ అయ్యాక ఖాళీ బెర్త్ చూసుకోవడం ఇక మరింత ఈజీ! IRCTC యాప్‌లో ఈ కొత్త ఫీచర్ చూశారా?
ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి..
మీరు తత్కాల్ కోటాపై టిక్కెట్ బుక్ చేస్తున్నట్లు అయితే, ఆధార్ వెరిఫికేషన్ కూడా తప్పనిసరి అని గుర్తుంచుకోండి. ముందుగానే మీ ఐఆర్‌సీటీసీ ఖాతా ఆధార్ వెరిఫై చేయండి. బుకింగ్ సమయంలో మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ తర్వాతే మీ టిక్కెట్ బుక్ అవుతుంది.
భారతీయ రైల్వేలో ఏజెంట్ రూల్స్..
భారతీయ రైల్వేలో మీరు ఏజెంట్ ద్వారా టిక్కెట్ బుక్ చేయిస్తే కొన్ని రూల్స్ ఉన్నాయి. బుకింగ్ వారికి ఏసీ క్లాస్ అయితే, 10:30 గంటలకు, నాన్ ఏసీ అయితే, 11:30 గంటలకు మాత్రమే బుకింగ్‌కు అనుమతి ఉంటుంది.