Weather News Today: ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ రెండు వాతావరణ వ్యవస్థలు ఒకేసారి ప్రభావం చూపుతుండటంతో, రానున్న రెండు రోజులు రెండు రాష్ట్రాల్లో వాతావరణం చల్లగా మారడమే కాకుండా పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈనెల 19, 20 తేదీల్లో ఏపీలో అతిభారీ వర్షాలు నమోదు అవుతాయని వాతావరణశాఖ సూచించింది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఇచ్చిన సమాచారం ప్రకారం, కోస్తాంధ్రలోని పలు ప్రాంతాలతో పాటు రాయలసీమలోని నంద్యాల, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడతాయి. వర్షం కురిసే సమయంలో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే