ఏపీకి వాతావరణ శాఖ భారీ హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రమంతా ఇప్పటికే మోస్తరు నుండి భారీ వర్షాలు పడుతున్న తరుణంలో, మరో రెండు రోజులు వర్షాలు కొనసాగుతాయని తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం నుండి కర్ణాటక, తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని చెప్పారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల వద్ద ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొన్నారు. దీని ప్రభావం వల్ల ఇవాళ, రేపు కోస్తా జిల్లాలు, నంద్యాల, అనంతపూర్, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. పిడుగులు, ఈదురు గాలులు వచ్చే అవకాశం