Cyclone Alert in Bay of Bengal: అక్టోబర్ 27వ తేదీ నాటికి అండమాన్ వద్ద ఏర్పడే అల్పపీడనం బలపడి.. వాయుగుండంగా మారి మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని.. 30వ తేదీ నాటికి ఇది తుఫాన్‌గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు చెబుతున్నాయి. ఈ నెల 30వ తేదీ నాటికి తుఫాన్‌గా మారి.. ఇది కోస్తా ఆంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇది జరిగితే ఏపీలోని కోస్తా జిల్లాల్లో, తెలంగాణలో భారీ వర్షాలు కురిసి.. తెలుగు రాష్ట్రాలు ఎల్ నినో కరువు నుండి బయటపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు భావిస్తున్నారు. సముద్ర మట్టానికి ఐదు కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్న ద్రోణి