Published: Oct 19, 2026, 08:00 PM|Updated: Oct 19, 2026, 08:25 PM
Tirumala: తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు మలయప్ప స్వామి.. స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం ఇచ్చారు. శ్రీవారిని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. తిరుమాడ వీధులన్ని ఎక్కడ చూసిన కూడా భక్తుల గోవింద నామస్మరణలతో మార్మోగిపోయాయి.