తిరుపతిలోని నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసులు ముళ్ల కంచెలను ఏర్పాటు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా అప్రమత్తమైన పోలీసులు, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. నామినేషన్ కేంద్రాల్లో కేవలం అనుమతి పొందిన వారికి మాత్రమే ప్రవేశం కల్పించేలా చర్యలు చేపట్టారు. నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా సాగేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద శాంతిభద్రతలకు భంగం కలగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ పోలీసు అధికారులను ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఖచ్చితంగా అమలు చేస్తూ, నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేలా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. నామినేషన్ కేంద్రాల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, అభ్యర్థులు, వారి