ముఖ్యంగా విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి, వరంగల్–హైదరాబాద్ మార్గాల్లో వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనాలు పెద్ద సంఖ్యలో రావడం వల్ల టోల్‌ప్లాజాల వద్ద తీవ్ర రద్దీ నెలకొంది. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా, బీబీనగర్ వద్ద ఉన్న రాయగిరి, గూడూరు టోల్గేట్ల వద్ద వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి. చౌటుప్పల్ సమీపంలో దాదాపు రెండు నుంచి మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నెమ్మదిగా కదలడం వల్ల ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. వాహనాల రద్దీ పెరగడంతో పోలీస్, రవాణా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ముఖ్యమైన జంక్షన్లలో ప్రత్యేక బృందాలను మోహరించారు. చౌటుప్పల్ వద్ద ట్రాఫిక్ నిలిచిపోకుండా చూడటంలో భాగంగా అధికారులు వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల వైపు