Published: Oct 15, 2026, 05:40 PM|Updated: Oct 15, 2026, 05:42 PM
Sreeleela Bathukamma Celebrations: ప్రస్తుతం దేవీ నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ పూజలు అలా ఉంచితే.. తెలంగాణలో బతుకమ్మ వేడుకల సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఊరూవాడాలోని మహిళలు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహిస్తుండగా.. తాజాగా మల్లరెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్లో ఘనంగా జరిగిన బతుకమ్మ సంబరాల్లో హీరోయిన్ శ్రీలీల తళుక్కున మెరిసింది.