Published: Oct 13, 2026, 07:15 PM|Updated: Oct 13, 2026, 07:26 PM
Singareni Workers Dasara Bonus దసరా పండుగ సందర్భంగా సింగరేణి సంస్థ తన ఉద్యోగులకు శుభవార్త తెలియజేసింది. సంస్థలో ఎన్నో ఏళ్లుగా సేవలు అందిస్తున్న రెగ్యులర్ కార్మికులతో పాటు కాంట్రాక్ట్ ప్రాతిపదికన చేస్తున్న సిబ్బందికి కూడా దసరా నజరానా ప్రకటించారు. ఇందులో భాగంగా కాంట్రాక్ట్ కార్మికులకు ప్రతి ఒక్కరికీ రూ.5,500 చొప్పున పండుగ బోనస్ అందిచనుండగా.. సింగరేణి సాధించిన నికర లాభాల్లో 34 శాతం పర్మినెంట్ కార్మికులకు బోనస్ అందించాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు అర్హులు అయిన ప్రతి కార్మికుడికి గరిష్టంగా రూ. 1,53,913 వరకు అందించనుంది.