Srisailam Dasara: శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబికాదేవి అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందిన ఈ పవిత్ర క్షేత్రంలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రత్యేక పూజలు, అలంకరణలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.