Published: Nov 26, 2026, 19:05 IST|Updated: Nov 26, 2026, 19:08 IST
Telangana Paddy Farmers Crisis News: తెలంగాణలో సన్న రకం వరి సాగు చేసిన రైతులకు తీవ్ర కష్టాలు మొదలయ్యాయి. నెల రోజుల క్రితం వరకు పొలాల వద్దే పోటీపడి రికార్డు ధరలు చెల్లించిన వ్యాపారులు, ఇప్పుడు సిండికేట్‌గా మారి క్వింటాల్‌పై ఏకంగా రూ. 1,400 నుంచి రూ. 1,500 వరకు కోత విధించారు. గ్రామాల్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడం వల్ల దళారుల దోపిడీకి అడ్డుకట్ట పడక, ఆలస్యంగా కోతలు చేపట్టిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.