Kavitha vs Revanth Reddy: ఇంటర్మీడియట్ వ్యవస్థను రద్దు చేసి పాఠశాల విద్యలో కలిపేయాలని రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలపై మాజీ ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకపక్షంగా ఇంటర్ విద్యను రద్దు చేస్తామంటే అంగీకరించమని స్పష్టం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తలతో సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని రేవంత్ రెడ్డికి సూచించారు.