Karthika Deepotsavam In Tirumala Temple For Karthika Pournami: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని తిరుమలలో నేత్రపర్వంగా కార్తీక దీపోత్సవం జరిగింది. దీపాల వెలుగుల్లో తిరుమల ఆలయ పరిసరాలు దేదీప్యమానంగా వెలిగిపోగా.. ఈ సందర్భంగా టీటీడీ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తిరుమల పరిసరాల్లో కార్తీక దీపాలు వెలిగించారు.