పల్నాడు జిల్లా తిమ్మాపురం గ్రామంలో ఆదివారం సర్పంచ్ పదవికి నామినేషన్ల ప్రక్రియ జరుగుతున్న సమయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామ టీడీపీలోని అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. సర్పంచ్ పదవి కోసం స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అనుచరుడు, టీడీపీకి చెందిన నాగండ్ల రాంబాబు, పావులూరి శ్రీనివాసరావు వర్గాలు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశాయి. దీంతో ఇరు వర్గాల మధ్య వివాదం తీవ్రస్థాయికి చేరింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సమయంలో రెండు వర్గాలు సంయమనం పాటించి రాజీమార్గంలో నడిచాయి.