తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. రేపటి నుంచి ఐదు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. 19, 20, 21వ తేదీల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని చెబుతూ, ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కర్ణాటక నుంచి నైరుతి బంగాళాఖాతం వరకు ఏర్పడిన ఉపరితల ద్రోణి తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు విస్తరించి ఉండటంతో ఈ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.