Published: Oct 10, 2026, 06:25 PM|Updated: Oct 10, 2026, 07:51 PM
Janasena Ministers Cabinet Meeting Today: ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం నేడు ప్రత్యేక సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి సంబంధించిన ముగ్గురు మంత్రులు గైర్హాజరు అవ్వడం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన బీసీ రిజర్వేషన్ల కేటాయింపుపై నిర్వహించిన స్పెషల్ క్యాబినేట్ మీటింగ్ కీలకమైన మంత్రులు హాజరు కాకపోవడం వెనుక ఏదైనా కారణం ఉందా అంటూ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.