Local Person Attack On GHMC Worker: సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ బోర్డులో పారిశుద్ధ్య పనులు చేస్తున్న మహిళా కార్మికులపై ఓ దుండగుడు దాడికి పాల్పడ్డాడు. లాల్‌బజార్‌కు చెందిన చంద్రకళ, అడ్డగుట్టకు చెందిన శకుంతల కంటోన్మెంట్ బోర్డు పారిశుద్ధ్య విభాగంలో సెప్టెంబర్ 29వ తేదీన పనిచేస్తుండగా స్థానికుడు వచ్చి వాగ్వాదానికి దిగాడు. అనంతరం ఇద్దరు మహిళా కార్మికులతోపాటు వాచ్‌మెన్‌పై దాడికి పాల్పడ్డాడు.