Published: Oct 07, 2026, 07:30 PM|Updated: Oct 07, 2026, 07:40 PM
Delhi Jantar Mantar Internet Shut: ఢిల్లీలోని జంతర్‌మంతర్ ప్రాంతంలో ఇంటర్నెట్ నిలిపేశారు. నీట్ పేపర్ లీక్‌పై క్రాకోచ్ జనతా పార్టీ చేసిన నిరసన సందర్భంగా ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జూలైలో ఇంటర్నెట్‌ను నిలిపేయగా.. దాదాపుగా మూడు నెలల తర్వాత మరోసారి ఇంటర్నెట్‌ను అధికారులు నిలిపివేశారు. ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)లో జరిగిన అవకతవకలపై ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న క్రమంలో ఢిల్లీలోని జంతర్ మంతర్, దాని పరిసర ప్రాంతాల్లో 12 గంటల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలని శుక్రవారం టెలికాం కంపెనీలకు ఆదేశాలు వచ్చాయి.