Jaipur Devotee Donates Gold Ornaments To Tirumala: తిరుమల శ్రీవారికి రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన ఆర్తి బిందాల్ దంపతులు రూ.51.55 లక్షల విలువైన బంగారు ఆభరణాలు విరాళంగా అందించారు. మొత్తం 174 గ్రాముల బంగారు ఆభరణాలను స్వామికి ఇచ్చారు. రూ.44.35 లక్షల విలువైన 147 గ్రాముల వజ్రాలు, రత్నాలు పొదిగిన బంగారు లాకెట్ ఉంది. రూ.7.20 లక్షల విలువైన 27 గ్రాముల వజ్రాలు, కెంపులు పొదిగిన మూడు వరుసల ముత్యాలహారాన్ని అందించారు.