Published: Nov 12, 2026, 07:40 PM|Updated: Nov 12, 2026, 08:08 PM
AP Rain Alert: ఆంధ్రప్రదేశ్‌ను మరో తుఫాను ముప్పు భయపెడుతోంది. దక్షిణ అండమాన్ సముద్రంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడి, ఈ నెల 15 నాటికి వాయుగుండంగా బలపడే అవకాశముందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఇది సముద్ర తీరానికి చేరువయ్యే కొద్దీ మరింత బలపడి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర మధ్య తీరం దాటవచ్చని అంచనా వేశారు. పరిస్థితులు అనుకూలిస్తే తుఫానుగా మారే ప్రమాదం ఉండటంతో, దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే నాలుగు నుంచి ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఇటీవల వచ్చిన అర్ణబ్, మురసు తుఫానుల బీభత్సం నుంచి కోలుకోకముందే మరో విపత్తు పొంచి ఉండటంతో అధికార యంత్రాంగం అత్యంత అప్రమత్తమైంది.