దీపావళి సందర్భంగా కరీనా కపూర్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఫోటో ఈ వివాదానికి కారణమైంది. ఆమె ధరించిన 30 క్యారెట్ల పచ్చ లాకెట్పై ఖురాన్లోని ఆయత్ అల్ కుర్సీ వచనం చెక్కి ఉందని, కరీనా ధరించిన ఆభరణాలు దాదాపు 200 ఏళ్ల చరిత్ర కలిగినవని ఆమె స్టైలిస్ట్ రికా కపూర్ పేర్కొన్నారు. ఈ ఆభరణాలు భోపాల్ రాజకుటుంబ వారసత్వ సంపదని, సైఫ్ అలీ ఖాన్ కుటుంబం ద్వారా కరీనాకు చేరాయని రియా వివరించారు. లాకెట్ ఫోటోలు, వీడియోలు, సోషల్ మీడియా పోస్టులపై కాంగ్రెస్ నేత అబ్బాస్ హఫీజ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సంబంధిత ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగించాలని, బహిరంగంగా క్షమాపణ చెప్పాలని నోటీసులో కోరారు.