వెయ్యి మంది వరకు నిపుణులు, పాలసీ మేకర్లు, పెట్టుబడిదారులు ఈ సమ్మిట్‌కు రానున్నారు. వారందరి అభిప్రాయాలు తీసుకుని, తెలంగాణ అభివృద్ధికి వారి ఆలోచనలను, అనుభవాలను ఉపయోగించుకోనున్నామని తెలిపారు. త్వరలో నిర్వహించనున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు కూడా ఉపయోగపడేలా, రాష్ట్ర ఆర్థిక విధానాలను, అమలు చేస్తున్న కార్యక్రమాలను పెట్టుబడిదారులకు వివరిస్తామని శ్రీధర్‌బాబు చెప్పారు. ప్రపంచ దక్షిణ దేశాల సహకారం, సాంకేతికత, కృత్రిమ మేధ, భౌగోళిక రాజకీయ పరిణామాలు, యువత, లింగ సమానత్వం, వాతావరణ మార్పులు, అంతర్జాతీయ జర్నలిజం వంటి 12 కీలక అంశాలపై ఈ సమ్మిట్‌లో చర్చించనున్నారు. ఈ సమ్మిట్‌కు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకాగాంధీ హాజరయ్యే అవకాశం ఉంది.