శేఖర్ మాస్టర్‌కు స్వల్ప గాయాలైనప్పటికీ, కారులో ఉన్న మిగతా వారంతా సురక్షితంగా బయటపడ్డారు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాద వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. శేఖర్ మాస్టర్ త్వరగా కోలుకోవాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న కాకా సినిమాకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌కు ఆయన కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. 2027 జనవరి 13న సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. కాగా నవంబర్ 6నే శేఖర్ మాస్టర్ పుట్టినరోజును కాకా సెట్లో చిత్రబృందం