Telangana Pension News: మంజూరైన కొత్త పెన్షన్లను పారదర్శకంగా, పండుగ వాతావరణంలో లబ్ధిదారులకు అందించేందుకు చర్యలు చేపట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో మండల కేంద్రాల్లో, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కార్యాలయాల వద్ద లేదా వార్డుల వారీగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తూ కొత్త లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలు అందజేయనున్నారు. పంపిణీ ప్రక్రియలో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తాగునీరు, నీడ వంటి మౌలిక వసతులు కల్పించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న వేలాది చేనేత కార్మిక కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించనుంది.