Published: Oct 12, 2026, 05:45 PM|Updated: Oct 12, 2026, 06:24 PM
Tiger Spotted in East Godavari: ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాల్లో ఇప్పుడు ఓ పెద్ద పులి కలకలం సృష్టిస్తోంది. తాళ్లపూడి, పోలవరం, గోపాలపురం మండలాల్లో వివిధ గ్రామాల ప్రజల్లో కంటిమీద కునుకు లేకుండా పోయింది. రెండు రోజుల క్రితం సీతానగరం మండలం నుంచి గోదావరి దాటుకొని ఏలూరు జిల్లా పోలవరం మండలం గూటాల మీదుగా తూర్పూ గోదావరి జిల్లాలోకి ప్రవేశించినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ప్రజలను అప్రమత్తం చేసిన అటవీ శాఖ అధికారులు.. టైగర్ రిజర్వ్ బృందాలతో సుమారు 30 మంది అటవీ శాఖ అధికారులు పెద్దపులి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.