Published: Oct 30, 2026, 08:10 PM|Updated: Oct 30, 2026, 08:16 PM
Hyderabad Rain Forecast: బంగాళాఖాతం పరిసరాల్లో కొనసాగుతున్న సుస్పష్టమైన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. తాజాగా హైదరాబాద్ నగరంలో భారీ వర్షపాతం నమోదయ్యింది. శుక్రవారం సాయంత్రం నుంచి కురిసిన భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయం అయ్యాయి. అయితే రాబోయే 2 గంటల పాటు హైదరాబాద్ నగరవ్యాప్తంగా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించింది.