Published: Oct 11, 2026, 07:30 PM|Updated: Oct 11, 2026, 07:31 PM
Gajwel MRO Suspend Video: సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో రైతుపై ఎమ్మార్వో చేసిన అనుచిత వ్యాఖ్యల వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే బాధిత రైతు వీడియోతో సహా జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా.. దీనిపై ప్రస్తుతం విచారణకు ఆదేశించారు. దీనిపై రెవెన్యూ డివిజనల్ అధికారి ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా కలెక్టర్ ఎమ్మార్వోను సస్పెండ్ చేస్తు ఆదేశాలు జారీ చేశారు. అంతే కాకుండా అధికారులంతా కార్యాలయాలకు వచ్చే వారి పట్ల బాధ్యతతో, నిబద్దతో పనిచేయాలని ప్రవర్తించాలని ఆదేశించారు.