KCR NTR The Paradise Movie: నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా పక్కా యాక్షన్ అవతారంలో నటించిన 'ది ప్యారడైజ్' చిత్రం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సినిమా ప్రదర్శన ద్వారా ప్రేక్షకులు, నాని అభిమానులకు పలు ఊహించని సర్ ప్రైజ్‌లు లభించాయి. అయితే ఈ సినిమాలో విశేషమేమిటంటే.. తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కీలక మలుపు తిప్పిన ఇద్దరు ప్రముఖ మాజీ ముఖ్యమంత్రుల స్ఫూర్తితో రూపొందించిన విశిష్ట పాత్రల ప్రస్తావన ఈ చిత్రంలో చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పోలిన పాత్రలతో అలరించారు. అందులో ఒక పాత్రను ఎమ్మెల్యేగా, మరొక పాత్రను రాష్ట్ర ముఖ్యమంత్రిగా వెండితెరపై చూపించారు. ఈ రెండు కీలకమైన పాత్రలలో ప్రముఖ నటులు