Published: Sep 30, 2026, 08:30 PM|Updated: Sep 30, 2026, 08:32 PM
Harish Rao Priyadarshe Photos: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావును టాలీవుడ్ నటుడు ప్రియదర్శి కలిశారు. 'ది ప్యారడైజ్' సినిమాలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్రను పోలిన ఎమ్మెల్యే శంకరన్న పాత్రను నటుడు ప్రియదర్శి పోషించారు. అయితే ఆ పాత్రకు మంచి స్పందన లభించింది. ఇప్పుటికే పలువురు బీఆర్ఎస్ నేతలు ప్రియదర్శికి అభినందనలు తెలుపుగా.. ఇప్పుడు మాజీ మంత్రి హరీశ్ రావు తన ఇంటికి పిలిచి ప్రియదర్శిని ప్రశంసించారు.