KTR Emotional: నాని నటించిన ‘ది ప్యారడైజ్’ సినిమాలో ప్రియదర్శి పోషించిన ఎమ్మెల్యే శంకరన్న పాత్ర కేటీఆర్ తండ్రి, మాజీ సీఎం కేసీఆర్‌ను పోలి ఉందంటూ చర్చ జరుగుతోంది. సినిమా చూసిన అనంతరం కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అణచివేతపై పోరాటాన్ని సినిమాలో చూపించిన విధానాన్ని ప్రశంసిస్తూ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నాని, ప్రియదర్శికి అభినందనలు తెలిపారు.