స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని నేతలు కోరనున్నట్లు సమాచారం. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎన్నికల్లో విజయం సాధించేలా సందేశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాకినాడ జిల్లా జనసేన పార్టీలో టికెట్ల కేటాయింపు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. పెద్దాపురం మండల జడ్పీటీసీ అభ్యర్థి ఎంపికపై అధిష్ఠానం తీసుకున్న ఆకస్మిక నిర్ణయం పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి రగిల్చింది. పెద్దాపురం మండలం గుడివాడ గ్రామానికి చెందిన సీనియర్ జనసేన నాయకుడు అంబటి గంగాధర్ తనకు టికెట్ కేటాయించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో ఎంపీ ఉదయ్ నివాసం ఎదుట రాత్రి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా పెద్దాపురం