ఈరోజు ఏదులాబాద్ నుంచి ప్రారంభమై, నాలుగో రోజు జవహర్ నగర్లో ముగియనుంది. దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజ్గిరిలో డంపింగ్ యార్డ్ సమస్య కారణంగా లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. అపారమైన చెత్త వల్ల ఆ ప్రాంతం నుంచి ముప్పై కిలోమీటర్ల మేర భూగర్భ జలాలు కలుషితమయ్యాయని ఆయన తెలిపారు. ఈ సమస్యపై ఇప్పటికే అనేకసార్లు ముఖ్యమంత్రిని కలిసినా ఫలితం లేకపోయిందని అన్నారు. తన నియోజకవర్గ ప్రజల సమస్యను ప్రభుత్వ దృష్టికి మరోసారి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే తాను స్వయంగా ఈ యాత్రను చేపట్టినట్లు చెప్పారు. ఈరోజు ఏదులాబాద్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఈటల రాజేందర్ యాత్రను ప్రారంభించారు.