గ్యాస్ లీకేజీ ఘటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది, సంబంధిత అధికారులు అందుబాటులో ఉన్నారన్నారు. గ్రామస్తులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, అధికారుల సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రజల భద్రతకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు.