Published: Oct 26, 2026, 07:10 PM|Updated: Oct 26, 2026, 07:14 PM
Vijay Rashmika Fake News: విజయ్ దేవరకొండ, రష్మిక ఇటీవలే ఓ బాలీవుడ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే అందులోని ఓ విషయంపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. తమపై కావాలనే కొందరు పనిగట్టుకొని తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని విజయ్, రష్మిక టీమ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. తమ జంటపై బురద జల్లే వాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ డి.సి.పి.కి ఫిర్యాదు చేశారు.