Published: Nov 07, 2026, 09:25 PM|Updated: Nov 07, 2026, 09:32 PM
RK Roja Emotional At Counting Centre: చిత్తూరు జిల్లా ఇల్లత్తూరు ఎంపీటీసీ ఉప ఎన్నికల ఫలితంపై వైసీపీ నేత ఆర్కే రోజా అభ్యంతరం వ్యక్తం చేశారు. వైసీపీ తరఫున పోటీ చేసిన తమ అభ్యర్థి మొదట 10 ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్లు తొలుత సమాచారం ఇచ్చి, రీకౌంటింగ్ తర్వాత టీడీపీ అభ్యర్థి మూడు ఓట్లతో గెలిచినట్లు ప్రకటించారని రోజా ఆరోపించారు. ఈ క్రమంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఆ వెంటనే రోజా తన అనుచరులతో నిరసన చేపట్టగా పోలీసులు ఆమెను ఈడ్చుకెళ్లి కారులోకి ఎక్కించారు.