ఈ రోజు ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి హకీంపేటకు చేరుకుని మెగా రైతుమేళా, ఇండస్ట్రియల్ ఎక్స్పోను ప్రారంభించనున్నారు. అనంతరం ప్రదర్శన స్టాళ్లను సందర్శించి, ఆదర్శ రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో ముఖాముఖిలో పాల్గొంటారు. పారిశ్రామికవేత్తలతో కూడా ప్రత్యేకంగా సమావేశమవుతారు. ఈ రైతుమేళాలో 26 ప్రభుత్వ శాఖలు, అనుబంధ సంస్థల ఆధ్వర్యంలో సుమారు 150 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. నాణ్యమైన విత్తనాలు, ఆధునిక వ్యవసాయ యంత్రాలు, డ్రోన్లు, సాగు పరికరాలు, కొత్త సాంకేతిక పరిజ్ఞానం, ప్రభుత్వ పథకాలను ప్రదర్శించనున్నారు.