ఢిల్లీలోని సంచార్ భవన్లో జరిగిన తెలంగాణ రూరల్ ఇంటర్నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ తొలి బోర్డు సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసింది. డిజిటల్ భారత్ నిధి నిర్వాహకుడు శ్యామల్ మిశ్రా, ఏబీపీ అమలు విభాగ డైరెక్టర్ హర్ష శర్మ, రాష్ట్ర ప్రభుత్వ ఐటీ సంయుక్త కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి, ట్రైసిల్ సీఈఓ, టీ ఫైబర్ ఎండీ పన్నీరు వేణు ప్రసాద్, బీఎస్ఎన్ఎల్ ప్రతినిధి జి.రాజారాంమోహన్ పాల్గొన్నారు. వికాస్‌రాజ్, నవీన్ మిత్తల్, గౌరవ్ ఉప్పల్ తదితర ఐఏఎస్ అధికారులు వర్చువల్‌గా హాజరయ్యారు.