పరిషత్ ఓట్ల లెక్కింపు రాత్రి 8లోపు పూర్తిచేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కలెక్టర్లను ఆదేశించింది. కాగా లెక్కింపు కేంద్రాల వద్ద 40,679 మందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేశారు. కేంద్రం లోపల, బయట సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటుచేశారు. ఫుటేజ్‌ని రాష్ట్ర ఎన్నికల సంఘం ఓట్ల లెక్కింపు పూర్తయిన 60 రోజుల వరకు భద్రపరుస్తుంది. కౌంటింగ్ కేంద్రం పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేశారు. అనుమతి ఉన్న వ్యక్తులను మాత్రమే కేంద్రంలోకి పోలీసులు అనుమతిస్తున్నారు. అభ్యర్థులు, వారి ఏజెంట్లు నిబంధనలకు అనుగుణంగా కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నారు.