తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాల నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. తిరుపతి జిల్లాలో కుండపోతగా వర్షం పడుతోంది. ZPTC, MPTC కౌంటింగ్ కేంద్రాల వద్ద వర్షం కారణంగా ప్రజలు, అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షంలో తడుస్తూనే పోలీసులు విధులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.