Published: Nov 07, 2026, 07:30 PM|Updated: Nov 07, 2026, 08:15 PM
Surekha Vani Video Controversy: టాలీవుడ్ నటి సురేఖా వాణి మరోసారి వార్తల్లో నిలిచారు. తనకు సంబంధించిన కొన్ని ప్రైవేట్ వీడియోల వివాదంతో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు. తనకు సంబంధించిన కొన్ని వ్యక్తిగత వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అనుమతి లేకుండా వ్యక్తిగత విషయాలను ప్రచారం చేయడం వల్ల మానసికంగా ఎంతో ఇబ్బందికి గురవుతున్నానని తెలిపారు. అంతేకాకుండా ఈ వ్యవహారంపై తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.