నిపుణుల అంచనా ప్రకారం ఆరునెలల్లో, పది గ్రాముల బంగారం ధర రూ.1.70 లక్షలకు చేరవచ్చని చెబుతున్నారు. ఈ వారంలోనే ధర రూ.1.48 లక్షల నుంచి రూ.1.50 లక్షలకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు. ధరల్లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ పెట్టుబడుల డిమాండ్ కొనసాగుతోంది. సెప్టెంబర్‌లో భారత్‌లో గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి రూ.4,450 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇది ఆగస్టుతో పోలిస్తే 71 శాతం ఎక్కువ.