Train Derailment News: అస్సాం రైలు ప్రమాదం జరిగిన వెంటనే ఈశాన్య సరిహద్దు రైల్వే ఉన్నతాధికారులు, సహాయక బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఇప్పటివరకు అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే తెలిపింది. అయితే, పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని, ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు, ట్రాక్ పునరుద్ధరణ పనులను పర్యవేక్షిస్తున్నామని అధికారులు వెల్లడించారు.