నవంబర్ నెల ప్రారంభంతో తెలంగాణలో చలి పెరిగింది. గత కొన్ని రోజులుగా వర్షాలు తగ్గిపోయి పొడి వాతావరణం నెలకొంది. దీంతో రాత్రి, ఉదయం వేళల్లో చలి గాలులు బలంగా వీస్తున్నాయి. దీంతో ప్రజలు తెల్లవారుజామున బయటకు రావడానికి చలికి జంకుతున్నారు. వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం రాబోయే రోజుల్లో రాత్రి ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉంది.