ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బొమ్మదేవర ధీరజ్, టి. గణేష్ అద్భుతమైన ప్రదర్శనతో ఆసియా క్రీడల్లో పతకాలు సాధించారు. గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న క్రీడాకారులకు శాప్ చైర్మన్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అధికారులు ఘన స్వాగతం పలికారు. తాను ఏషియన్ గేమ్స్‌లో రెండు సిల్వర్ మెడల్స్ సాధించానని ధీరజ్ తెలిపారు. తల్లిదండ్రులు, గురువులు, శాప్, స్పోర్ట్స్ అధికారులు, ప్రభుత్వం నుండి లభించిన ప్రోత్సాహంతోనే తాను ఇక్కడి వరకు వచ్చి మెడల్స్ సాధించగలిగానన్నారు. వచ్చే ఒలింపిక్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించి భారతదేశానికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకువస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అన్నా ధీరజ్.