Published: Nov 21, 2026, 19:50 IST|Updated: Nov 21, 2026, 20:14 IST
YS Jagan Vs YS Sharmila Palace: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కుమార్తె వివాహాన్ని బెంగళూరులోని ఎలహంక ప్యాలెస్‌లో జరిపించేందుకు సిద్ధం కాగా, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భద్రతా కారణాలతో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్కడ పెళ్లి వద్దంటూ జగన్ లేఖ రాయడంతో అన్నచెల్లెళ్ల మధ్య వివాదం మరింత ముదిరింది. జగన్ అభ్యంతరాలను లెక్కచేయకుండా కుటుంబంతో కలిసి బెంగళూరు బయలుదేరిన షర్మిల, అక్కడ తనను అడ్డుకుంటే ధర్నా చేస్తానని హెచ్చరించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.