ఈ రైస్ మిల్లు అక్రమాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కోణంలోనే ఈడీ, విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. రేఖా నాయక్‌ను అధికారులు విచారిస్తుండగా, కీలక పత్రాలను పరిశీలిస్తున్నారు. మరోవైపు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇంటి పరిసరాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఈ దాడుల నేపథ్యంలో ఖానాపూర్‌లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది.