60 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ అరుదైన చందనోత్సవం కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమం నవంబర్ 16 నుంచి 20 వరకు జరిగింది. ఈ వేడుకలో స్వామివారి అసలు రూపంపై 60 సంవత్సరాలుగా ఉన్న చందనాన్ని తొలగించే సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో ఆంజనేయ స్వామి నిజరూప దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు. 41 రోజుల పాటు భక్తులకు స్వామివారి నిజరూప దర్శనం లభిస్తుంది. 60 ఏళ్లకు ఒకసారి మాత్రమే నిర్వహించే ఈ విశిష్ట ఆధ్యాత్మిక క్రతువును నవంబర్ 15 నుంచి డిసెంబర్ 29 వరకు భక్తులు వీక్షించే భాగ్యం కలుగుతుంది.