హైదరాబాద్లోని కొండాపూర్ కేంద్రంగా స్నేహ గ్రూప్ పౌల్ట్రీ, ఫీడ్ తయారీ, ఎడిబుల్ ఆయిల్స్ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం కేంద్ర కార్యాలయంతో పాటు విజయవాడ, ఇతర ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా డైరెక్టర్లు రామ్ రెడ్డి, వరుణ్ రెడ్డి, స్నేహ డిండి నివాసాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. పన్ను ఎగవేత, ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలకు సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం అందుతోంది.